calender_icon.png 21 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు నైతిక విలువలను అలవర్చుకోవాలి

21-04-2025 12:00:00 AM

తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి

 ఘనంగా శ్రీదత్త విద్యాసంస్థలలో ఇన్ఫినిటీ 2025  

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20: విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలనీ తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం శేరిగూడ లోని శ్రీ దత్త విద్యాసంస్థలలో ఘనంగా ఇన్ఫినిటీ 2025 నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ డాక్ట ర్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. శ్రీ దత్త విద్యా సంస్థల చైర్మ న్ జి.పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ జి.ఎన్.వి వైభవ్ రెడ్డి, రిటైర్డ్ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వైజయంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణారెడ్డి విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యతో పాటు నైతిక విలువలు, వినయ, విధేయతలు కలిగి ఉండాలని, మారుతున్న కాలాన్ని కనుగుణంగా సాంకేతిక విద్యతో పాటు, నైపుణ్యం పెంచుకొని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు. శ్రీ దత్త విద్యాసంస్థల చైర్మన్ పాండు రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనస్తత్వాలను జాగృతి పరిచే దిశగా సెలబ్రేషన్స్ నిర్వహించామని, తల్లిదండ్రులు నమ్మకాన్ని శ్రీ దత్త విద్యాసంస్థలు నిలబెడుతున్నాయని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు హకథన్, కోడింగ్, కల్చరల్ లాంటి ఈవెంట్స్ తమ విద్యాసంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వైస్ చైర్మన్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ అకాడమిక్ టాపర్స్ ఆటలు, సంస్కృతిక కళతో విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికలను ప్రవేశపెట్టి ఉత్త మ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్ మెడల్, సిల్వర్ మెడ ల్, విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశామన్నారు.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ దత్త పూర్వ విద్యార్థి సింగర్ కృష్ణ చైతన్య తన బృందంతో పాల్గొని పాటలతో యువతను ఉ ర్రూతలూగించారు. జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దు ల్లా (చిట్టి), జబర్దస్త్ ఫేమ్ సద్దాం పులి, నవ సందీప్, జ్ఞానేశ్వర్ కామెడీతో యువత కేరింతలతో ఉత్సాహంగా విద్యార్థులు ఆ నందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, వివిధ విభాగాధిపతులు, శ్రీ దత్త విద్యా సంస్థల డీన్ అకాడమిక్స్ డాక్టర్ అచ్చుతారావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఈ. మధుసూదన్ రెడ్డి, డాక్టర్ సెంథల్ కుమార్, కన్వీనర్స్, కో కన్వీనర్స్ తదితరులు పాల్గొన్నారు.