calender_icon.png 27 December, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

04-12-2024 04:55:19 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మాంటిస్సోరి అకాడమిక్ డైరెక్టర్ విష్ణుమహంతి భరత్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మటూరి మిథున ఏడవ తరగతి చదువుతున్న మాటూరి అవిఘ్నలు రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో కరీంనగర్ జిల్లా జట్టులో రాణించి విజయం సాధించడం అభినిందనీయమని, వీరు ఈనెల 8 నుంచి 14 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండుసర్ లో జరిగే జాతీయ స్థాయి బాలికల అండర్ 14 హాకీ క్రీడా పోటీల్లో ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ప్రతి విద్యార్థి వారిని ఆదర్శంగా తీసుకొని చదువుల్లో రాణిస్తూనే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గీతాషాజు, డైరెక్టర్స్ షాజూ థామస్, గండ్ర సుధాకర్ రెడ్డి, నూకల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.