డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ పోటీలను శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహించారు. మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి 200 మంది బాల బాలికలు పాల్గొన్నారు. డిడి మాట్లాడుతూ.. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన జట్టు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని ఎంపికైన క్రీడాకారులకు ఆదివారం నుండి 26వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపు నిర్వహించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈనెల 27 నుండి 29 వరకు వరంగల్ జిల్లా హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్ జూనియర్ బాల బాలికల పోటీల్లో ఎంపికైన జట్లు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఎం ఓ ఉద్ధవ్, జి సి డి ఓ శకుంతల, గిరిజన క్రీడల అధికారి బండ మీనారెడ్డి, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, హెచ్ఎం జంగు, ఎస్ జి ఎఫ్ మాజీ కార్యదర్శి సాంబశివరావు, కోచ్ లు అరవింద్, సాగర్, తిరుమల, రవి, రాకేష్, సాయి, కళ్యాణ్, శేఖర్, పిడి, పిఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.