విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఉపాధ్యాయులు
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి) : విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ బాలికల గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన టెన్త్ జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్సోర్ట్స్తో ప్రతిభ కనబరిచిన జట్లకు గురువారం బహుమతులు ప్రదానం చేశా రు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని క్రీడలకు సమయం కేటాయించాలన్నారు. పాఠశాలలో కొత్తగా గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థినులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.