14-04-2025 12:34:22 AM
సెమినార్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, ఏప్రిల్13(విజయక్రాంతి): హక్కుల సాధనతో పాటు దేశ పౌరులుగా బాధ్యతను కూడా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలో సమగ్రాభివృద్ధికి సంక్షేమ పథకాలు అనే అంశం పై వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. అందుకు చదువు అననే ఆయుధాన్ని స్వీకరించాలని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిబాపూలే ఉన్నత చదువులు అభ్యసించి దేశ అభివృద్ధికి పునాదులు వేశారని తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులంతా మహనీయుల చరిత్రను తప్పక తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు మార్గాలను భవిష్యత్తు తరాలు అనుసరిస్తాయని విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు.
ఎస్ ఆర్ ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి, ఓ.ఎస్.డి డా. హరికాంత్, కన్వీనర్ డా.మనోహర్, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, మైనారిటీ సెల్ సంచాలకులు డా.ఉమేరా తస్లీమ్, బీసీ సెల్ సంచాలకులు డాక్టర్ సరసిజా, ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సూరేపల్లి సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. జయంతి, పరీక్షల నియంత్రణ అధికారి అబ్రరూల్ బకి, ఆచార్య వరప్రసాద్, డా. రంగప్రసాద్, డా. శ్రీవాణి, డా. మునావర్, అధ్యాపకులు డా. జోసఫ్ డా. తిరుపతి, డా. విజయకుమార్, డా. రవికుమార్, డా. రాజు, డా. యశ్వంతరావు, డా. ప్రసాద్, హరికృష్ణ, నరసింహ చారి పాల్గొన్నారు.