విద్యార్థులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు...
ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం రాంనగర్ సెయింట్ పాయిస్ హైస్కూల్లో 66వ వార్షిక స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రత్తను పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని అన్నారు. సెయింట్ పాయిస్ స్కూల్ విద్యార్థులను క్రమశిక్షణతో చదివించడంతో పాటు క్రీడా రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సెయింట్ పాయిస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ లిండా జరాల్డ్, ఎస్సీసీ అధికారి మేజర్ జయసుధ, ముషీరాబాద్ విద్యామండలి మాజీ డిప్యూటీ డీఈవో చిరంజీవి, ఇండియన్ అథ్లెటిక్ నందిని, స్కూల్ కరస్పాండెంట్ నక్షత్ర, సెయింట్పాలు ఎస్ స్కూల్ సుపీరియర్ మాణిక్యం, బీఆర్ఎస్ నగర నాయకుడు ఆర్.మోజేస్ పాల్గొన్నారు.