calender_icon.png 30 October, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలబంద కమనీయం

24-10-2024 12:00:00 AM

కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది దీన్ని ఇండోర్ ప్లాంట్‌గా పెంచుకుంటున్నారు. దీన్ని మెయింటెనెన్స్ చాలా సులభం. వ్యాధులు రావు. ఎలాంటి వాతావరణంలో అయినా సులభంగా పెరుగుతుంది. ఇంట్లో, గదిలో కలబంద మొక్కను పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇంటీరియల్ స్పేస్‌కు కొత్త అందాన్ని తీసుకొస్తుంది. కలబంద జెల్‌తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

కలబంద గుజ్జులో..

కలబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్‌గా వాడతారు. ఇది నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ మొక్కకు గాలిని శుద్ధి చేసే లక్షణాలు సైతం ఉంటాయి. అందుకే దీన్ని ఇంట్లో పెంచుకుంటే, గదిలోని హానికరమైన కలుషితాలను పీల్చుకొని, స్వచ్ఛమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. గాలి నాణ్యత పెరగడంతో శ్వాసకోశ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కాలిన గాయాలను నయం చేయగలదు. కలబంద చర్మాన్ని తేమగా మారుస్తుంది. 

యాంటీ ఏజింగ్ లక్షణాలు..

కలబంద మెడిసినల్ ప్లాంట్.. దీని గుజ్జును అనేక వ్యాధులకు నివారిణిగా, చికిత్స కోసం ఉపయోగిస్తారు. కలబంద జ్యూస్ చేసుకొని తాగవచ్చు. లేదా ఈ జెల్‌ను చర్మానికి అప్లు చేసుకోవచ్చు. దీంతో చర్మం సాగే గుణం పెరిగి, వృద్ధాప్య లక్షణాలు దూరం అవుతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

అందం కోసం..

పోషకాలు పుష్కలంగా ఉన్న కలబంద. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమల చికిత్స కోసం కలబంద జెల్‌ను వాడతారు. వివిధ రకాల మొటిమల సమస్యలను ఇది దూరం చేస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి, కాసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. దీంట్లోని ఏ,సీ,ఈ విటమిన్లు చర్మ, జుట్టు ఆరోగ్యానికి మంచివి. 

ఇమ్యూనిటీ పవర్..

కలబంద మొక్క ఒత్తిడిని దూరం చేస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థను సైతం బలపరుస్తుంది. ఆక్సిడేషన్ స్ట్రెస్, ఫ్రీ రాడికల్స్, యూవీ కిరణాల ప్రభావాన్ని తట్టుకునేలా చేస్తుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు దీన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

ఆరోగ్యం.. 

కలబంద మన శరీరం ఐరన్‌ను శోషించుకునే సహాయపడుతుంది. విటమిన్ల శోషణను సైతం పెంచుతుంది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

సంప్రదాయ మొక్కలు

కలబంద మొక్కలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తాయి. తద్వారా ఇవి ఇంటికి రక్షణ కవచంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా ఇది మనసును శుద్ధిచేసే శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఎందుకంటే ఇవి పాజిటివ్ ఎనర్జీతో ప్రశాంతతను కలిగిస్తాయి. అందువల్ల నెగిటివ్ విష యాలపైకి మనసు మళ్లదు.