calender_icon.png 2 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మభిక్షం సేవలు మరువలేనివి

27-03-2025 01:39:17 AM

సూర్యాపేట, మార్చి 26: నాయకత్వం, త్యాగం, సమాజసేవలో మాజీ ఎంపీ, కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం అలుపెరుగని పోరాటం చేశారని, ఆయన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. బుధవారం బొమ్మగాని ధర్మ భిక్షం 14 వ వర్ధంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల సమీపంలో గల అయన విగ్రహానికి నివా ళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ధర్మబిక్షం తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని, పోరాటం విషయంలో రాజీపడని పోరాట యోధుడన్నారు. జీవిత కాలమంతా కమ్యూనిస్టుగానే జీవించిన గొప్ప నేత అని, విద్య ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతను గుర్తించి తన ఉద్యమాన్ని  ప్రారంభించిన గొప్ప యోధుడన్నారు. నేటి యువతకు ఆయన జీవితం ఆదర్శమన్నారు.