14-04-2025 12:24:29 AM
కరీంనగర్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ స్వాముల భిక్ష నాలుగో రోజు కొనసాగింది. కొత్తపల్లిలోని జయపాల్రెడ్డి ఫామ్హౌజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చల్లహరీష్శంకర్ అన్నదాతగా వ్యవహరించగా.. పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు, భక్తులు హాజరయ్యారు.
ముఖ్యఅతిథిగా విద్యానగర్ బాలభక్తాంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకులు చింతల రమేష్ హాజరై..ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 300 మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి. సంపత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లేశంచారి, గొల్ల రవి, రాజ్కుమార్, కుమార్, శ్రీను, విజయ్, పొరండ్ల శ్రీను, నాయక్, కొమురయ్య, తీగలగుట్టపల్లి శ్రీను, రాగంపేట శ్రీనివాస్, సాగర్, మహిళా సేవకులు పాల్గొన్నారు.