calender_icon.png 17 October, 2024 | 4:58 PM

బాదం మసాజ్‌తో బోలెడు బెనిఫిట్స్

28-09-2024 12:00:00 AM

బాదంలా.. దాని నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది చర్మం, జుట్టుకు చాలా ఆరోగ్యకరమైనది. ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. వీటితోపాటు మెగ్నీషియం,  ప్రొటీన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, పొటాషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. తల నుంచి కాలి వరకు ప్రయోజనాలను అందిస్తుంది. బాదం నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే గొప్ప ప్రయోజనాలున్నాయి.

బాదం నూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. అలసటను దూరం చేస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. 

 బాదంనూనెలో యాంటీఆక్సిడెంట్ మూలకాలు ఎక్కువ. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనితో మసాజ్ చేయడం వల్ల మొటిమలు, తామర, లాంటి రకాల చర్మవ్యాధులకు చెక్ పెట్టొచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మెరుపును పెంచుతుంది. కొత్త చర్మ కణాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. దీనివల్ల తలలో దురద, చుండ్రు లాంటి సమస్యలు తొలగిపోతాయి. 

ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల పిల్లలకు తామర, ఎరుపు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడికి గురైన కండరాలు ఉపశమనం పొందేలా చేస్తుంది.