31-03-2025 12:00:00 AM
చెన్నూర్, మార్చి 30 : చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. శ్రీ విశ్వావసు నామా ఉగాది పండుగను పురస్కరించుకుని పంచంగా శ్రావణ పూజలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ పంచంగా శ్రావణం కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.