calender_icon.png 22 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ మూవీకి సై

19-02-2025 12:00:00 AM

జాన్వీకపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి కొన్నేళ్లవుతోంది. ఎందుకోగానీ అమ్మడికి కెరీర్ టర్న్ అయ్యే మూవీయే పడటం లేదు. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసినా అవి సక్సెస్ కాలేదు. టాలీవుడ్‌లో ‘దేవర’ హిట్ అయినా కూడా ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు అమ్మడి గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తోందని టాక్. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుంది. వాస్తవానికి ఈ మూవీ త్రివిక్రమ్ అర్జున్ కాంబో తర్వాత ప్రారంభమవుతుందని అంతా భావిం చారు.

కానీ త్రివిక్రమ్ సినిమాకు ప్రి ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమవుతుండటంతో అట్లీతో అల్లు అర్జున్ సినిమా మొదలెడతాడని టాక్. ఈ సినిమాకు జాన్వీ కపూర్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. ఆమెతో చర్చలు పూర్తయ్యాయని.. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని టాక్. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ ముద్దుగుమ్మ ఓ క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన దర్శకత్వంలో ఓ మూవీ ప్రారంభం కానుందట. దీనికి జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. అయితే ఇది వెబ్ సిరీస్ అని కొందరు అంటున్నారు.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానున్న ఓ భారీ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరూ కలిసి పని చేయనున్నారని టాక్. ఇదే నిజమైతే జాన్వీకి ఇదే తమిళ్ డెబ్యూ కానుంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నుంచి కాస్త సైడ్ అవుతూ దక్షిణాదికి క్రమక్రమంగా దగ్గరవుతోంది.