calender_icon.png 23 December, 2024 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ ఇంటిపై దాడి

23-12-2024 02:54:17 AM

* రాళ్లు రువ్విన ఓయూ జేఏసీ నాయకులు 

* బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం ఓయూ జేఏసీ నేతలు దాడి చేశారు. రాళ్లు విసిరి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేసి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. ఆమె మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. ఈ క్రమం లో దాడికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి అల్లు అర్జున్ ఇంటి వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. 

చట్ట ప్రకారం చర్యలు: -వెస్ట్‌జోన్ డీసీపీ

అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ ని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. పలువురు అకస్మాత్తుగా ప్లకార్డులు పట్టుకుని అల్లు అర్జున్ నివాసం వద్దకు వచ్చి నినాదాలు చేశారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించొద్దు: అల్లు అరవింద్ 

సంధ్య థియేటర్ తొక్కసలాట ఘటనపై ఓయూ జేఏసీ స్పందించింది. ఆ సంస్థ నాయకులు ఆదివారం సాయం త్రం అల్లు అర్జున్ ఇంటి ఎదుట నిరసన కు దిగారు. రేవతి మరణానికి అల్లు అర్జు నే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదా లు చేశారు. ‘పుష్ప2’ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో చ నిపోయిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బం ది, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరిం త పెంచారు. ఇదిలా ఉండగా, విద్యార్థి సంఘాల ఆందోళనలపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ స్పందించారు. ‘మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చా రు. పోలీసులు కేసు పెట్టారు. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్లను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా రు. ఎవరూ ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించకూడదు. ఈ అంశంపై సంయమ నం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కోరారు.