ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సినీనటుడు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరయ్యాక జైలు నుంచి బయటకు వెళ్లమంటే తన ఫ్యాన్స్ వచ్చేవరకు అక్కడే ఉంటాననడం విడ్డూరంగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాగ్వాదానికి దిగితే జైలు అధికారులే అల్లు అర్జున్ ను మెడపట్టి బయటకు గెంటేశారని అన్నా రు. హీరోలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సిగ్గుచేటన్నారు. ప్రతి విషయం లో పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి సామాన్యులకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తున్నారన్నారు. ప్రభు త్వం, సీఎంపై అవమానకరంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు.