calender_icon.png 28 December, 2024 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

27-12-2024 11:08:05 AM

హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. అల్లు అర్జున్ కు గతంలో నాంపల్లి కోర్టు(Nampally Court) 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ గడువు ముగియడంతో అల్లు అర్జున్ కోర్టుకు హాజరవుతున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఇచ్చినట్లు అల్లు అర్జున్ లాయర్లు కోర్టుకు తెలపనున్నారు.

డిసెంబర్ 4న 'పుష్ప 2'(Pushpa 2: The Rule) చిత్రీకరణ సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళల మృతికి సంబంధించి అల్లు అర్జున్ ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక కోర్టు అతన్ని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తెలుగు నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైలు(Chanchalguda Central Jail) నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే.