calender_icon.png 7 January, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కడపల్లి పీఎస్‌కు అల్లుఅర్జున్

06-01-2025 01:14:58 AM

* నాంపల్లి కోర్టు షరతు మేరకు రిజిస్టర్‌లో సంతకం చేసిన సినీ నటుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ ఘటన కేసులో కోర్టు ఆదేశాల మేరకు సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌లో హాజరయ్యారు. ఆదివారం మామ చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాదితో పాటు చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చిన అల్లు అర్జున్ స్టేషన్‌లో సంతకం చేసి 5 నిమిషాల్లో తిరిగివెళ్లారు.

ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇటీవల నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పొందిన అల్లు అర్జున్‌కు ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే.

అయితే సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాపాయంతో నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి ఆది  అల్లు అర్జున్ వెళ్లాల్సి ఉండగా అక్కడికి  రావొద్దంటూ రాంగోపాల్‌పేట పోలీసులు చివరి నిమిషంలో అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. దీంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే కార్యక్రమాన్ని అల్లు అర్జున్ రద్దుచేసుకున్నారు. స్టేషన్ బయట ఫ్యాన్స్ సందడి నెలకొంది.