హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన సినీనటుడు అల్లు అర్జున్ బెయిల్ మంజూరుకు సంబంధించిన పూచీక త్తు పత్రాలను శనివారం న్యాయమూర్తికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మామ చంద్రశేఖర్‌రెడ్డితో కలి సి అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు హజరయ్యారు.
సంధ్య థియేటర్ ఘటనలో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన రెగ్యూలర్ బెయి ల్ మంజూరు చేసిన సంగతి తెలిసిం దే.
ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు రూ. 50 వేల పూచీకత్తు పత్రాలను సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయరాదని, రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు షరతులు విధించింది. దీంతో నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ రెండు రూ.50 వేల పూచీకత్తు పత్రాలను వేర్వేరుగా న్యాయమూర్తికి అందజేశారు.