calender_icon.png 23 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం కనిపించలేదు

23-12-2024 02:39:01 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): అల్లు అర్జున్ మాటల్లో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి కుటుంబంపై సానుభూతి చూపించకుండా.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట లను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసని ఆయన ప్రశ్నించారు. తొక్కిసలాటలో మహిళతో పాటు బాబు చనిపోయాడనుకొని పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పే ప్రయత్నం చేసినా వినలేదని, డీసీసీ వచ్చి చెప్పాక కూడా థియేటర్ బయట షో చేసుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావించినందుకే సీఎం స్పందించారని తెలిపారు. అల్లు అరవింద్ కూడా జరిగిన ఘటనకు చింతించాల్సింది పోయి సీఎంను తప్పుబట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.