- తన ఇమేజ్‌ను దెబ్బతీశారని ఆరోపించడం సరికాదు
- చట్టం దృష్టిలో ఐకానిక్ స్టార్లుండరు
- సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 22, (నల్లగొండ, విజయక్రాంతి): సినీ హీరో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనరిగి జిల్లా యాదగిరి గుట్ట లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆదివారం హాజరైన మంత్రి భువనరిగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తన ఇమేజ్‌ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురుదాడికి దిగ డం సరికాదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను దవాఖాన లో పరామర్శించేందుకు వెళ్లకుండా లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పరామర్శకు వెళ్లేందుకు లీగల్ టీమ్ అడ్డు చెబుతుందని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ మానవత్వం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. చట్టం దృష్టిలో ఐకానిక్ స్టార్లుండరని.. అందరూ సమానమేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. థియేటర్‌కు వచ్చేందుకు పోలీసులు అనుమతించకున్నా బౌన్సర్లను వెంటేసుకొచ్చి అల్లు అర్జున్ మహిళ చావుకు కారణమయ్యారని ఆక్షేపించారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబం ధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాలనే సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారన్నారు.
ఇకపై రాష్ట్రంలో బెన్‌ఫిట్ షోలు.. ఎక్స్‌ట్రా షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలూ పెంచేది లేదని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో అక్రమాలపై విచారణ జరుపుతున్నామని అందులోని స్థలాలను జూనియర్ ఆర్టిస్టులకు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతలేని రాష్ట్రం..
ప్రస్తుతం రాష్ట్రానికి ప్రతిపక్షనేత కరవయ్యారని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానిం చారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదని.. కూలేశ్వరమని ఎద్దేవా చేశా రు. యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళి క రూపొందిస్తున్నామని తెలిపారు. నాలుగేండ్లలో ఉమ్మడి జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు.