‘పుష్ప 2’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రంపై అంచనాలు భారీగానే ఉంటాయనడంలో సందేహం లేదు. అయి తే తదుపరి చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంటుంది. ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో గతంలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
అల్లు అర్జున్ నాలుగో చిత్రం పాన్ ఇండి యా స్థాయిలో తెరకెక్కనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ వివరాలను నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ‘డాకు మహారాజ్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగవంశీ తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాల నే దానిపై త్రివిక్రమ్‌తో కూర్చొని ఫైనల్ చేయనున్నారట.
ఈ ప్రాజెక్ట్ ‘పుష్ప2’కి ఏమాత్రం తీసిపోదని నాగవంశీ తెలిపారు. అంతేకాకుండా కథ గత చిత్రాలను మించేలా ఉంటుందన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఒక స్టూడియోను సైతం నిర్మిస్తున్నట్టు తెలిపారు.
ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ కీలకమన్నారు. పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్‌కు ఇది తొలి సినిమా కావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశారని నాగవంశీ తెలిపారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయ ని.. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారని నాగవంశీ వెల్లడించారు.