అల్లు అర్జున్‌కు దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉంది. కేరళ ప్రజలైతే అభిమానంతో ఆయన్ను మల్లు అర్జున్ అని పిలుచుకుం టారు. ఇక తమిళనాడులోనూ అభిమాన గళం బాగానే ఉంది. ఈ క్రమంలోనే ‘జైలర్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అల్లు అర్జున్‌తో స్ట్రెయిట్ తమిళ్ మూవీ చేయాలనుకుంటున్నారట. తమిళ ప్రేక్షకులు అల్లు అర్జున్ నటన, డ్యాన్స్‌ను విపరీతంగా ఇష్టపడతారట.
కాబట్టి వారికి దగ్గరయ్యేందుకు స్ట్రెయిట్ తమిళ్ సినిమా చేయాలని ఆఫర్‌ను ఆయన ముందుంచారట. తాజాగా నెల్సన్ మాట్లాడుతూ.. “నాకు తెలుగు అంతగా రాదు. కానీ అల్లు అర్జున్ మాత్రం తమిళ్ చాలా చక్కగా మాట్లాడతారు. ఆయనను కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను” అని తెలిపారు. నెల్సన్‌కు అల్లు అర్జున్ షేక్ హ్యాండ్ ఇవ్వడం గురించి ‘పుష్ప ది రూల్’ ఈవెంట్లో యాంకర్ ప్రశ్నించగా.. వారిద్దరి కొలాబరేషన్ గురించి మాత్రం కన్ఫర్మ్ చేయలేదు.
అయితే ‘జైలర్’ సక్సెస్ తర్వాత హైదరాబాద్‌లో అల్లు అర్జున్ను నెల్సన్ కలిసి స్టోరీ లైన్ నెరేట్ చేశారట. బన్నీ కూడా స్టోరీ లైన్ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ను నెల్సన్ చెప్పినట్టు సమాచారం. ‘పుష్ప 2’ తర్వాత నెల్సన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తారని తెలుస్తోంది.