calender_icon.png 28 January, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్‌కి ఈ కేసుతో సంబంధం లేదు

27-01-2025 11:36:41 AM

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) ఇటీవల అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యారు. ఆయన అరెస్టు తర్వాత తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలైన విషయం తెలిసిందే. అయితే, జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుట్ర ఉందని ఆరోపిస్తూ ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ ఆరోపణలపై కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ(Choreographer Shrasti Verma) స్పందించారు. ఈ కేసు వెనుక ఎలాంటి కుట్ర లేదని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఈ వ్యవహారంతో సంబంధం లేదని శ్రష్టి వర్మ స్పష్టం చేశారు.

జానీ మాస్టర్‌పై ద్వేషంతో కేసు పెట్టలేదని, తన ఆత్మగౌరవం దెబ్బతినడంతో ధైర్యంగా ముందుకు వచ్చానని వివరించింది. ఎవరైనా మహిళను శారీరకంగా, మానసికంగా దోపిడి చేయడం, ఆమె స్థానంలో మరో మహిళను నియమించడం ఆమోదయోగ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. జానీ మాస్టర్స్ జాతీయ అవార్డు(Icon star Jani Master National Award)ను రద్దు చేయడంలో తన ప్రమేయం లేదని వెల్లడించింది. అంతేకాకుండా, కేసును ఉపసంహరించుకోవడానికి తనకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్లు శ్రష్టి పేర్కొంది. అయితే ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించానని, తాను భయపడే రకం కాదని తేల్చిచెప్పింది. పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ, సృష్టి వర్మ తన కుటుంబం తనకు అండగా నిలిచిందని, జానీ మాస్టర్‌పై కేసును కొనసాగించినప్పుడు తిరుగులేని మద్దతునిచ్చిందని శ్రష్టి వర్మ పేర్కొన్నారు.