calender_icon.png 10 January, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్స్‌కు అల్లు అర్జున్

08-01-2025 12:48:36 AM

  1. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలపై ఆరా
  2. బాలుడి తండ్రిని పరామర్శించిన సినీ నటుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): పుష్ప- 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంగళవారం సినీ నటుడు అల్ల్లు అర్జున్ పరామర్శించారు.

ఆయన వెంట ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న అల్లు అర్జున్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్‌తోనూ మాట్లాడారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అల్లూ అర్జున్ రూ. కోటి, పుష్ప  నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షల చెక్కులను ఇటీవల దిల్‌రాజు ద్వారా.. శ్రీతేజ్ కుటుంబానికి అందజేశారు. కుటుంబానికి భవిష్యత్‌లో  అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.