calender_icon.png 9 January, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ వాయిదా

30-12-2024 01:29:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య 70 ఎంఎం థియేటర్(Sandhya 70mm Theater) తొక్కిసలాట కేసులో తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌(Bail Petition)పై నాంపల్లి కోర్టు విచారించింది. సోమవారం వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3కు రిజర్వ్‌ చేసింది. అల్లు అర్జున్(Allu Arjun)పై కేసు నమోదు చేసిన డిసెంబర్ 13న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు(Nampally Court) నటుడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు చంల్‌గూడ జైలుకు పంపించారు. అతని న్యాయవాది అదే రోజు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం జైల్ నుంచి బయటకు వచ్చారు. సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును తరలించాలని సూచించింది.