హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో శుక్రవారం నాంపల్లి కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్(Allu Arjun bail petition)పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు(Nampally Court) ఈనెల 30కి వాయిదా వేసింది. సంధ్య థియేటర్లలో పుష్ప-2(Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టయ్యాడు. డిసెంబర్ 13న నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని మంజూరు చేసింది. అయితే, హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, లాడ్ చేసిన కొద్ది గంటల్లోనే అర్జున్ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నుండి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందారు.