బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో..
- కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన పీపీ
- విచారణ 30కి వాయిదా
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11గా అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల ఆయనను అరెస్ట్ చేసి, అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
హైకోర్టు అదేరోజు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో, మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకోవాల ని అల్లు అర్జున్‌కు హైకోర్టు సూచించింది.
మ రోవైపు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగియగా.. సెక్యూరిటీ, శాం తి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హజరు అవుతారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. సానుకూలంగా స్పం దించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. దీం తో శుక్రవారం ఆయన వర్చువల్(వాట్సాప్ వీడియో కాల్)గా న్యాయస్థానం ఎదుట హా జరయ్యారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌కు హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న విషయాన్ని ఆయన తరపు లాయర్లు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది.