calender_icon.png 25 December, 2024 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్

24-12-2024 11:45:06 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్ ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారిస్తున్నారు. సంధ్య థియేటర్ కేసులో నిన్న పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇంటి నుంచి ఒకే కారులో చిక్కడపల్లి పీఎస్ కు వచ్చారు. వారి వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పీఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన వాహనాల రాకపోకలను నిలిపివేసి పోలీసు స్టేషన్ కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు.