calender_icon.png 13 December, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈ కేసులోనే.. FIR కాపీ

13-12-2024 01:45:59 PM

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను ఇంటి వద్ద కుటుంబసభ్యుల సమక్షంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, అల్లు శిరీస్ వెళ్లారు. నిన్న ఢిల్లీలో పుష్ప-2 సక్సెస్ మీట్ ముగించుకుని అల్లు అర్జున్ హైదరాబాద్ కు వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంధ్య థియేటర్ ఘటనలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు.

సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనలో ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ని రికార్డ్ చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు  తరలించనున్నారు.