హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌ను చీకడపల్లి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ అసంతృత్తి వ్యక్తం చేశారు. నన్ను తీసుకెళ్లడంలో తప్పులేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. పోలీసులు మరీ బెడ్ రూమ్ వరకు వస్తారా?, నన్ను బట్టలు కూడా మార్చుకోనివ్వరా? అని ప్రశ్నించారు. ఇది మంచి విషయం కాదని అల్లు అర్జున్ తెలిపారు. అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలుసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని కూడా పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించేదు.