హైదరాబాద్,(విజయక్రాంతి): సంధ్య థియేటర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని కోరారు, ఎవరినీ కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దన్నారు. ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ఐడీలతో కొందరు గత కొన్ని రోజులుగా పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెగిటివ్ పోస్టులు పెడుతున్న వారికి నా అభిమానులకు ధూరంగా ఉండాలని అల్లు అర్జున్ సూచించారు.
పుష్ప-2 ప్రీమియర్ షో వేళ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదుకాగా అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు ఫేక్ ఐడీలు ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు పోస్టులు పెట్టిన విషయన అల్లు అర్జున్ దృష్టికి రావడంతో స్పందించారు. అయితే శనివారం జరిగిన శసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ప్రస్తావనపై మట్లాడారు. ఒక్కరోజు జైలులో ఉండి వచ్చిన హీరో ఇంటి దగ్గర క్యూ కట్టి మరి ప్రభుత్వాన్ని తిడుతున్నారనడం గమనార్హం. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.