హైదరాబాద్: సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప-2 చిత్ర నిర్మాత రవిశంకర్ బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించారు. బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై తండ్రి భాస్కర్ తో దిల్ రాజు, అల్లు అరవింద్ చర్చించించారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయాలపై శ్రీతేజ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పుష్ప-2 చిత్ర యూనిట్ తరుఫున శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరుఫున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. పరిహారం చెక్కులను ఎఫ్ డీసీ ఛైర్మన్ కు అల్లు అరవింద్ అందించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ... బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తెలిపారు. త్వరలోనే శ్రీతేజ్ మనముందు తిరుగుతాడని ఆయన ఆశించారు.