calender_icon.png 22 March, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌పై అఖిలపక్ష భేటీ చరిత్రాత్మకం: సీఎం స్టాలిన్

22-03-2025 11:06:16 AM

చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టంపై చెన్నైలో డీలిమిటేషన్ పై డీఎంకే నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్(Tamil Nadu Chief Minister M K Stalin) అధ్యక్షతన పార్టీలకతీతంగా అఖిలపక్ష భేటీ సమావేశం అయింది. ఈ సందర్భం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ పై అఖిలపక్ష భేటీ(All-party meeting) చరిత్రాత్మకంగా నిలిచిపోతోందని చెప్పారు. డీలిమిటేషన్ ను కచ్చితంగా వ్యతిరేకించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ తో విద్యార్థులు, మహిళలకు తీవ్ర నష్టం జరుగుతోందని స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడుకు కేంద్ర సందేశం గందరగోళంగా ఉందని ఆయన సూచించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ హాజరయ్యారు.