calender_icon.png 2 October, 2024 | 3:53 PM

ప్రైవేట్ జూనియర్ కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతి

02-10-2024 02:41:08 AM

నాన్‌లోకల్ షిఫ్టింగ్‌కూ అవకాశమిచ్చిన విద్యాశాఖ

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల షిఫ్టింగ్ (తరలింపు)కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పలు కాలేజీలకు సంబంధించిన జీవోలను మంగళవారం వేర్వేరుగా విడుదల చేసింది. ఇంటర్ డిస్ట్రీక్ట్‌తోపాటు వేరే జిల్లాలకు సైతం కాలేజీలను తరలించేందుకు అవకాశమిచ్చింది.

నాన్‌లోకల్ షిఫ్టింగ్ కింద నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీని మహబూబ్‌నగర్ జిల్లాకు, కామారెడ్డి నుంచి మేడ్చల్ జిల్లాకు ఒకటి, వరంగల్ నుంచి సికింద్రాబాద్‌కు ఒకటి, నాగర్‌కర్నూల్ నుంచి రంగారెడ్డి జిల్లాకు మరో కాలేజీ తరలింపునకు అనుమతులిచ్చింది.

కరీంనగర్‌లోని ఓ ప్రముఖ జూనియర్ కాలేజీని నిజామాబాద్ జిల్లాకు, వర్ధన్నపేట నుంచి వరంగల్‌లోని కొత్తవాడకు ఒకటి, జగిత్యాల నుంచి హనుమకొండకు, మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు, మెదక్  జిల్లా రామాయంపేట నుంచి గుట్టల బేగంపేట గ్రామం, రంగారెడ్డి జిల్లాకు కాలేజీల షిఫ్టింగ్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. వీటితోపాటు మరికొన్ని కాలేజీలకు కూడా ఇలా తరలింపునకు అవకాశం ఇచ్చినట్టు తెలిసింది.