రైతులకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విజ్ఞప్తి
ఎల్బీనగర్, నవంబర్ 9 : ట్రంక్‌లైన్ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని రైతులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరా రు. ఈ మేరకు శనివారం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లోని శివారు కాలనీల్లో డ్రైనేజీ అవుల్లెట్ నిర్మాణంపై సాహెబ్‌నగర్ రైతులు ఎమ్మెల్యేతో చర్చించారు.
సాగర్ కాంప్లెక్స్ నుంచి వచ్చే వరదను కాప్రాయ్ చెరువులోకి రాకుండా గుర్రంగూడ ఫారెస్టు మీదుగా పెద్దఅంబర్‌పేట శివారులోకి వదలాలని సూచించారు. పొలాల మీదుగా వెళ్తున్న ట్రంక్‌లైన్ పనులకు స్థలం ఇవ్వాలని రైతులను కోరారు.
భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.