calender_icon.png 27 December, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేమ శాతంలో సడలింపు ఇవ్వండిl

05-11-2024 01:38:46 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లా 

డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి

మునుగోడు, నవంబర్ 4: పకృతి సహకరించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీసీఐ అధికారులు తేమ విషయంలో సడలింపు ఇవ్వాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కోరా రు. సోమవారం మండలం కేంద్రంలోని కార్తికేయ కాటన్ మిల్లులో అధికారులు కొనుగోలు చేస్తున్న పత్తిని ఆయన పరిశీలించారు. అధికారులు తేమ శాతం పేరుతో కోర్రీలు పెడుతున్నారని, పత్తి కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా .. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్ నరేందర్, వ్యవసాయ మార్కెట్ కమి టీ సెక్రటరీ రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు భీమనపల్లి సైదులు, పాల్వాయి చెన్నారుడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు.