రాష్ట్రంలో ౩౦౦లకుపైగా గుర్తింపులేని కాలేజీలు
అయినా అడ్మిషన్ల స్వీకరణ.. తరగతుల నిర్వహణ
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ అనుమతి రాని కాలేజీలు వందల్లో
ఎం రమేశ్ :
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కళాశాలలను నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అనుబంధ గుర్తింపు ఉంటేనే విద్యార్థులు ఆ కళాశాలలో చదివినట్టు నమోదవుతుంది. గుర్తింపు కోసం కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజ్ డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్, శానిటరీ సర్టిఫికెట్‌తోపాటు బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అ
న్ని రకాల అనుమతులు వివిధ శాఖల నుంచి ఉండాల్సిందే. అప్పుడుగానీ అడ్మిషన్లు చేపట్టడానికి సంబంధించి గుర్తింపును ఇంటర్ బోర్డు ఇవ్వదు. కానీ, కొన్ని ప్రైవేట్ కాలేజీలు సరైనా గుర్తింపు లేకున్నా 2024 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టడమే కాకుండా తరగతులు కూడా ఎంచక్కా నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను సాకుగా చూపి ఏళ్ల తరబడిగా కళాశాలలను నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 300 నుంచి 340 వరకు కాలేజీలకు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ అనుమతి ఇంతవరకూ లేదు. మరో 30 నుంచి 50 కాలేజీల వరకు షిఫ్టింగ్ అనుమతి లేదు. అయినా, కళాశాలలను నడిపిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరానికి 1,479 వరకు ప్రైవేట్ కాలేజీలు అనుబంధ గుర్తింపునకు ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా 1139 కాలేజీలు ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు పొందినట్టు తెలిసింది. ఇంకా 300కుపైగా కాలేజీలకు ప్రభుత్వం మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ అనుమతినివ్వలేదు.
ఏటా ఇదే తంతు...
జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపునకు ఫిబ్రవరిలోనే ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆలస్య రుసుం లేకుండా మార్చి 31 వరకు, ఆలస్య రుసుముతో మే 5 వరకు దరఖాస్తు సమర్పించాలని షెడ్యూల్‌లో పేర్కొంది. జూన్ 1 నుంచి ఈ విద్యాసంవత్సరానికి తరగుతులు ప్రారంభమయ్యాయి. అయినా ఇంతవరకూ 300కుపైగా కాలేజీలు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ అనుమతిలేకుండానే అడ్మిషన్లు, తరగతులను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఇంటర్ ఆఫిలియేషన్ల ప్రక్రియ మొదలై ఆరు నెలలవుతోంది.
ఏటా కాలేజీల గుర్తింపు విషయంలో కఠినంగా ఉంటామంటూ ప్రకటిస్తూ చివరి నిమిషయంలో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఈ ఒక్క ఏడాదే మినహాయింపునిస్తూ కండిషన్ అఫిలియేషన్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం సర్వసాధారణమైంది. ఈ ఏడాది కూడా ఈ కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ధీమాలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్ద ఉందని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతోందని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం నాయకులు పేర్కొనడం గమనార్హం.
50 వేల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం...
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీల గు ర్తింపు విషయంలో సర్కారు కఠినం గా వ్యవహరించాలని విద్యార్థి సం ఘాలు కోరుతున్నాయి. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు జరగకుండా చూడా లి. కానీ, ఆ పని చేయడంలేదు. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కాలేజీలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో అందులో చదివే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. 300కు పైగా కాలేజీల్లో దాదాపు 50 వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అధికారికం గా అడ్మిషన్ లేదనే చెప్పొచ్చు. ఈ కా లేజీలు 20 నుంచి 25 సంవత్సరా ల క్రితం పెట్టినవి. వీటికి ప్రభుత్వం ఇ బ్బందులు పెట్టడం సరికాదని యాజమాన్యాల వాదన. గుర్తింపు ఇవ్వక పోతే వాటిలో చదివే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, వాటికి మినహాయింపు ఇవ్వాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.