21-02-2025 01:24:41 AM
* పోలీసుల మధ్యంతర పిటిషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్‌పై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ పంజాగుట్ట పోలీస్స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దర్యాప్తును నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలంటూ మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు.
లంచ్ మోషన్ రూపంలో విచారణ చేపట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు గురువారం హైకోర్టును కోరారు. ట్రయల్ కోర్టులో ఏ4, ఏ5 నిందితులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని, ఒకవేళ పిటిషన్‌కు అనుమతిస్తే ధిక్కరణ చర్యల కిందకు వస్తుందని న్యాయమూర్తికి విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ కింది కోర్టు నిందితులను పోలీసుల కస్టడీకి ఇవ్వలేదని, మధ్యంతర పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని స్పష్టం చేశారు.