calender_icon.png 15 January, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతాంతర వివాహాలకు అనుమతివ్వండి

18-07-2024 12:32:50 AM

బరేలీలో వివాదానికి దారితీసిన ఓ వర్గం మతపెద్ద వ్యవహారం

బరేలీ, జూలై 17: మధ్యప్రదేశ్‌లోని బరేలీ జిల్లాకు చెందిన పలువురు హిందూ మహిళలతో ముస్లిం పురుషులకు వివాహం జరిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ ముస్లిం మతపెద్ద జిల్లా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకున్నారనే వార్త స్థానికంగా నిరసనలకు దారితీసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఓ వర్గం నేతలు మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బరేలీ ఎస్‌ఎస్‌పీ అనురాగ్ ఆర్య అక్కడకు చేరుకొని  నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సామూహిక వివాహాలకు అనుమతి కోరుతూ సిటీ మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు సమర్పించబడింది. మేము ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడాము. ఆయా వివాహాలకు ఎటువంటి అనుమతి ఇవ్వబడదని మేము హామీఇస్తున్నాం అని తెలిపారు. పోలీసుల హామీతో నిరసనకారులు తమ ఆందోళనను విరమించారు.