calender_icon.png 5 January, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారుణ్య మరణానికి అనుమతివ్వండి

31-12-2024 03:19:36 AM

  1. కలెక్టరేట్ ఎదుట ఎస్సై భార్య నిరసన
  2. తన భర్త విహేతర సంబంధం పెట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపణ

నల్లగొండ, డిసెంబర్ 30 (విజయక్రాం తి): తన కారుణ్య మరణానికి అనుమ తివ్వా లని కోరుతూ ఓ ఎస్సై భార్య కలెక్టరేట్ ఎదు ట తన ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం నిరసనకు దిగింది. నల్లగొండ టాస్క్‌ఫోర్స్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న జాల మహేందర్‌కు 2010లో నార్కట్‌పల్లికి చెంది న జ్యోతితో వివాహమైంది.

వీరికి ఇద్దరు సంతానం. ఎస్సై మహేందర్ ఎ క్సైజ్ శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సం బంధం పెట్టుకున్నాడని జ్యోతి ఆరోపించింది. కుటుంబ ఆస్తులను మొత్తం మహిళా కానిస్టేబు ల్‌కు రాసిచ్చి తనతోపాటు పిల్లలను చంపేందుకు యత్నిస్తున్న ట్లు ఆరోపించింది.

గతంలో ఉన్న ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిం ది. ప్రస్తుత కలెక్టర్‌తోపాటు ఎస్పీ కి ఫిర్యాదు చేశానని, తన కారు ణ్య మరణానికి అనుమతివ్వాలని ఫిర్యాదులో కోరింది. ఎస్సై దంపతుల మధ్య చాలా ఏండ్లుగా వివాదం నడుస్తున్నట్లు సమాచారం.