calender_icon.png 28 October, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ ఫేజ్ పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తి

01-08-2024 01:22:13 AM

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): టీజీ పాలీసెట్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. మొత్తం 114 కాలేజీలుండగా వీటిలో 29,610 సీట్లకు 19,043 సీట్లు ఇప్పటివరకు భర్తీ అయ్యాయి. ఇంకా 10,567 సీట్లు మిగిలాయి. ఈనెల 2వ తేదీలోపు సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకుంటే ఆ సీటు రద్దవుతుందని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.