calender_icon.png 26 October, 2024 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూకేటాయింపులు

10-08-2024 12:24:56 AM

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 9 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పలు ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయిస్తూ శుక్రవారం రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

మహ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలం, శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్  స్థాపనకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలో 13.10 ఎకరాలు (ఎకరాకు రూ.11,25,000 చొప్పున), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థకు ఖమ్మం జిల్లా బల్లేపల్లిలో 17.20 ఎకరాలు, రఘునాథపాలెంలోని 35.06 ఎకరాలు, రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుకు యాదాద్రి జిల్లా దండుమల్కాపూరంలోని 6.23 ఎకరాలు (ఎకరాకు రూ.20 లక్షల చొప్పున), టీజీఐఐసీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్‌కు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని 61.18 ఎకరాలు (ఎకరాకు రూ.6,40,000 చొప్పున), రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి కామారెడ్డి జిల్లాలో క్యాసంపల్లి గ్రామంలోని 3 ఎకరాలు (ఎకరాకు రూ.1,80, 000), డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నిర్మాణానికి నిజామాబాద్ జిల్లా బిల్లదాఖలలో 800 గజాల ఆబాది (గ్రామ కంఠం) భూమి (చదరపు గజానికి రూ.16,200 చొప్పున), సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టరేట్ నిర్మాణానికి నల్లగొండ జిల్లా గొల్లగుండలో మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ (కేంద్ర ప్రభుత్వానికి)కు 0.10 గుంటల భూమి (చదరపు గజానికి రూ.8,083 చొప్పున), రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌కు నిర్మల్ జిల్లాలోని చించోలిలోని 6 ఎకరాలు, మంచిర్యాల్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోం మంత్రి త్వ శాఖకు 0.07 ఎకరాలు (ఎకరా రూ.15 లక్షలు), మహాత్మా జ్యోతిరావు ఫూలే బ్యాక్‌వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇని స్టిట్యూషన్ నిర్మాణానికి వరంగల్ జిల్లాలోని నాగరాజుపల్లి గ్రామంలో 11 ఎకరాలను కేటాయిస్తూ జీవోలు జారీ చేశారు.