హైదరాబాద్, సెప్టెంబర్2(విజయ క్రాంతి): మొదటి విడుత లా సెట్ సీట్లను అభ్యర్థులకు అధికారులు కేటాయించారు. మొత్తం కన్వీనర్ కోటా కింద 6,324 సీట్లలో 5,363 సీట్లను కేటాయించారు. మూడేళ్లు, ఐదేళ్లు లాకోర్సుల్లో ప్రవేశాలను కల్పించారు. ఎల్‌ఎల్‌బీ మూడేండ్ల కోర్సులో 4,285, ఎల్‌ఎల్‌బీ ఐదేండ్ల కోర్సులో 2,039 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. వీటిలో మూడేండ్ల కోర్సులో 3,901 సీట్లు, ఐదేండ్ల కోర్సులో 1,462 సీట్లను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఈనెల 3 నుంచి 6వ తేదీలోపు రిపోర్టింగ్ చేయాలని సూచిం చారు. ఈనెల 9 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.