calender_icon.png 1 November, 2024 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను బీసీ వసతి గృహానికి కేటాయింపు

01-11-2024 07:50:25 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను బీసీ వసతి గృహానికి కేటాయించమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం ఆదేశించారు. అనంతరం  మీడియా తో మాట్లాడుతూ..... ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి సౌకర్యలతో ముప్పై పడకలు ఏర్పాటు చేస్తూ  పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూడా బిసి వసతి గృహానికి కేటాయిస్తున్నామని అన్నారు.

ఇందులో నూట ఎనభై మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి ఏర్పాటు చేసి ఈనెల 20వ తేదీ నుండి హాస్టల్ పనులు ప్రారంభమౌతాయని అన్నారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీపడభోమని ఆయన స్పష్టం చేశారు.. అలాగే మండలంలో ఫైర్ స్టేషన్ లేనందున త్వరలో నే మున్సిపాలిటీ లో ఫైర్ స్టేషన్ తీసుకచ్చే ఏర్పాట్లు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర  గిరిజన కార్పొరేషన్ చైర్మన్  కోట్నాక తిరుపతి, జిల్లా ఆర్జీఫీస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణచందర్ రావు, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, వార్డ్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.