calender_icon.png 23 October, 2024 | 4:02 AM

ఐఏఎస్‌ల కేటాయింపు వివాదానికి ముగింపు

23-10-2024 02:21:23 AM

  1. ఏపీ అధికారి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు  
  2. మిగతావారికీ మూసుకు పోయిన దారులు 

న్యూఢిల్లీ, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటు సమయంలో కేంద్ర సర్వీస్ అధికారుల విభజన చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారు లు చేస్తున్న న్యాయపోరాటం ముగిసిపోయినట్టే అనిపిస్తోంది. క్యాడర్ అధికారుల విభ జన వివాదానికి తెరపడింది.

ఏపీలో పనిచేసే ఒక ఐఏఎస్ అధికారిని తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టి వేసింది. కేంద్ర సర్వీస్ అధికారుల విభజన వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇటీవ ల కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) నిరాకరించింది.

దీంతో ఏపీ, తెలంగాణలో పని చేసే ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలి తం దక్కలేదు. ఐఏఎస్ అధికారులు వేసిన వ్యాజ్యాలు వీగిపోయాయి. అధికారుల కేటాయింపుల్లో జోక్యం చేసుకునేందుకు క్యాట్ నిరాకరించింది. విచారణను నవంబర్ 4కి వాయిదా వేసింది.

దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఏడుగురు ఐఏఎస్ అధికారులు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో క్యాట్ ఆదేశాల్ని రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలనే మధ్యంతర పిటిషన్లను హైకోర్టు సైతం కొట్టివేసింది. ముందుగా విధుల్లో చేరాలని, ఆ తర్వాత క్యాట్ ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో ఏపీకి చెంది న ఐఏఎస్ అధికారి  శివశంకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయనకు చుక్కెదురైం ది. కడప జిల్లా కలెక్టర్‌గా చేస్తున్న శివశంకర్ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది.

ఐఏఎస్ క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని, తనను తెలంగాణకు కేటాయించడం అన్యాయమని, డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిష న్‌ను జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం మంగళవారం విచారించింది. హైదరాబాద్‌లోని క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.

శివశంకర్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. క్యాడర్ డివిజన్ చేస్తూ, డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలకు అను గుణంగా అధికారులు విధులు నిర్వహించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ తీర్పుతో సుప్రీంను ఆశ్రయించాలనుకున్న మిగతా అధికారుల ఆశలు ఆవిరైనట్లేనని, ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల కేటాయింపుల వివాదానికి పూర్తి తెరపడినట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.