calender_icon.png 16 January, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్లు కేటాయింపు

08-08-2024 01:36:41 AM

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రత్యేక విడుతలో 44,683 మంది సీట్లు పొందినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కామర్స్‌లో 16,200 మంది, లైఫ్‌సైన్సెస్‌లో 9,151 మంది, ఫిజికల్ సైన్సెస్‌లో 7,624 మంది, ఆర్ట్స్‌లో 7,490 మంది డీ ఫార్మసీలో 57 మంది, ఇతరులు 4,161 మంది సీట్లు పొందినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 9 వరకు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి తమ సీటును రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.