calender_icon.png 31 October, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు కేటాయింపు

04-07-2024 02:10:18 AM

తొలి జాబితా విడుదల 

1404 మందికి సీట్లు 

8 నుంచి కౌన్సిలింగ్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): విద్యాసంవత్సరానికి బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రెటేడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తొలి జాబితా విడుదలైంది. బుధవారం విద్యాశా ఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం, బాసర ట్రిపు ల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీ వెంకట రమణ కలిసి సచివాలయంలో జాబితాను విడుదల చేశా రు. మొత్తం 1404 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330 మంది ఎంపికవగా వనపర్తి, జోగులాబ గద్వాల జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మాత్రమే ఎంపికయ్యారు. తొలి జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. వివరాలకు www. rgukt.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.