30-04-2025 12:31:19 AM
ఖమ్మం, ఏప్రిల్ 29 ( విజయక్రాంతి ) : లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా ఖ మ్మం జిల్లాలో మూతబడిన రెండు బార్ల లైసెన్స్ దారులను మంగళవారం ఖమ్మం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఎంపిక చేశారు.మూతబడిన రెండు బార్ లకు సంబంధించి లైసెన్స్ దారుల ఎంపిక ప్రక్రియను కలెక్టర్ పారదర్శకంగా నిర్వ హించారు.జిల్లాలో మూతబడిన రెండు 2బీ బార్లకు 112 మంది అభ్యర్థుల ద్వారా 145 దరఖాస్తులు చేసుకున్నారు.
కాగా దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన బార్ల లైసెన్స్ దారుల ఎంపిక చేశా రు. బార్ల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగింది. లాటరీ ద్వారా సీరియల్ నెంబర్ 13 కు సంబంధించి జుట్టుకొండ లక్ష్మీ నారాయణ, సీరి యల్ నెంబర్ 135 కు సంబంధించి గుండవరం రాజేశ్వర రావు లను లైసెన్స్ దారులు గా ఎంపిక చేసినట్లు, వీరు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ టాక్స్ వెంటనే చెల్లించి కన్ఫ ర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జి. జనార్థన్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. వేణుగోపాల్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణ, ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తు దారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.