20-03-2025 02:01:31 AM
గతేడాది కంటే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ 5 శాతం పెరిగింది. సంక్షేమానికి కేటాయింపులు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేలా నిధులు కేటాయించారు. ఎన్నికల హామీలో విద్యారంగానికి బడ్జెట్లో కాంగ్రెస్ 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.
కానీ 7.57 శాతం మాత్రమే కేటాయించింది. విద్య, ఆరోగ్యానికి బడ్జెట్లో మరిన్ని నిధులిస్తే బాగుండేది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యం.. మానవ వనరుల అభివృద్ధికి ఇవ్వకపోవడం దురదృష్టకరం. అప్పుల భారం సైతం పెరిగింది.. భవిష్యత్లో రాష్ట్ర ప్రజలకు ఇది మంచిది కాదు. బడ్జెట్ మిశ్రమంగా ఉంది.
కొప్పుల అంజిరెడ్డి, ఆర్థికశాస్త్ర హెచ్‌ఓడీ, ఎంజీయూ