calender_icon.png 18 October, 2024 | 6:20 AM

బొగ్గుగని ఏర్పాటుకు అటవీభూమి కేటాయింపు

18-10-2024 02:37:45 AM



ఇల్లెండు ఏరియా 

జీఏం జాన్ ఆనంద్

కొత్తగూడెం, అక్టోబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని ఇల్లెందు ఏరియా జేకే 5 ఓసీ, 21 ఇన్‌క్లున్ కలుపుతూ నూతనగా ఏర్పాటు చేయనున్న బొగ్గుగని కోసం 151.85 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి సూత్రపాయంగా అనుమతినిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఉత్తర్వుల జారీ చేసిందని జీఎం జాన్ ఆనంద్ తెలిపారు. గురువారం ఇల్లెందు ఏరియాలోని వై సి ఓ ఏ క్లబ్, 24 ఏరియా నందు ఉన్నతాధికారులతో ఏరియా జీఎం జాన్ ఆనంద్.. బొగ్గుగనుల ఏర్పాటు పనుల పురోగతిపై సమీక్షించారు. తదుపరి చేపట్టవలసిన పనులకు సంబంధించి అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీ ఎం బొల్లం వెంకటేశ్వర్లు, ఏజీఎం (ఈఈ) గిరిధర్ రావు, ప్రాజెక్టు ఆఫీసర్ కృష్ణమోహన్, ఏరియా సెఫ్టీ అధికారి రామస్వామి, డీజీఎం (సివిల్) రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.