calender_icon.png 21 January, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐకి రూ.968 కోట్లు కేటాయింపు

24-07-2024 01:32:51 AM

2024-25బడ్జెట్‌లో దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీబీఐకి రూ.951.46 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపుల కంటే ఈసారి 1.79 శాతం తక్కువ కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం రివైజ్డ్ బడ్జెట్‌లో సంస్థకు రూ.౯౬౮.౮౬ కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సంస్థ నిర్వహణ ఖర్చులతోపాటు సీబీఐ ట్రెయినింగ్ సెంటర్ ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ విభాగాల ఏర్పాటు, కార్యాలయాల భవన నిర్మాణాలు, నివాస భవనాల నిర్మాణానికి స్థల సేకరణకు ఈ నిధులు కేటాయించారు.